చైతు షర్ట్ పట్టుకుంటే... సమంత ఎలా ఫీలయ్యిందంటే...  

చైతు షర్ట్ పట్టుకుంటే... సమంత ఎలా ఫీలయ్యిందంటే...  

నాగ చైతన్య కొత్త సినిమా లవ్ స్టోరీ పోస్టర్ ను నిన్నటిరోజున రిలీజ్ చేశారు.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఫిదా హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్నది.  చైతన్య షర్ట్ ను సాయి పల్లవి పట్టుకున్న ఫోటోను రిలీజ్ చేశారు.  చాలా ఎమోషన్ గా ఉన్న ఆ ఫోటో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  

అయితే, చైతు షర్ట్ పట్టుకుంటే సమంత చూస్తూ ఊరుకుంటుందా చెప్పండి.  నాలుగు వాయించదు.  కానీ ఇది సినిమా కాబట్టి సమంత లైట్ గా తీసుకుంది.  అంతేకాదు, సమంత ఓ మీమ్ ను ట్యాగ్ చేసి ఫన్నీగా కామెంట్ చేసింది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.