వరద బాదితులకి సంపూ విరాళం ! 

వరద బాదితులకి సంపూ విరాళం ! 

ప్రస్తుతం మన చుట్టపక్కల రాష్ట్రాలయిన కర్నాటక, కేరళ, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి, వేలాది మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ వరదల వలన వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ క్రమంలో టాలీవుడ్ నుండి ముందుగా ఈ వరద బాదితులకి సాయం ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నాడు బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు. "ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేసింది.  కన్నడప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిది కి ప్రకటిస్తున్నాను." అని సంపూ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. సంపూ ఈ విషయంలోనే కాక గతంలో కూడా చాలా విషయాల్లో ముందుగా స్పందించి అందరి మన్ననలను పొందాడు. తెలంగాణాలోని సిద్ధిపేటకి చెందిన వ్యక్తి అయినా ఏపీ యువత తలపెట్టిన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ విశాఖకు వెళ్ళిన సంపూర్నేష్ బాబుని అప్పట్లో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. గతంలో తిత్లీ తుఫాను, చెన్నై వరదల సమయంలో కూడా సంపూ తనవంతుగా ధనసహాయం చేశాడు. ఇక సంపూ హీరోగా నటించిన కొబ్బరిమట్ట సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.