అరడజను కెమెరాలు.. అదిరిపోయే ఫీచర్లు..!!

అరడజను కెమెరాలు.. అదిరిపోయే ఫీచర్లు..!!

ఒకప్పుడు ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉండాలంటే ల్యాండ్ ఫోన్ మాత్రమే అందుబాటులో ఉన్నది.  ఎప్పుడైతే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి మొబైల్ ఫోన్ విపణిలోకి వచ్చిందో అప్పటి నుంచే విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.  ఈ మార్పులకు అనుగుణంగా మొబైల్ ఫోన్స్ తయారయ్యాయి.  తక్కువ ధరలకే సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ ఫీచర్లు ఉన్న మొబైల్స్ నుంచి స్మార్ట్ ఫోన్లుగా మార్పులు జరిగింది. ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు రెండు ఉండేవి.  

కానీ, ఇప్పుడు అరడజను కెమెరాలతో ఫోల్డింగ్ మొబైల్ త్వరలోనే లాంచ్ కాబోతున్నది. ప్రపంచంలోనే ది బెస్ట్ మొబైల్ కంపెనీగా పేరు తెచ్చుకున్న శాంసంగ్ ఈ ఫోల్డింగ్ కెమెరా మొబైల్ ను లాంచ్ చేయబోతున్నది.  ఇందులో ఎన్నో అధునాతనమైన ఫీచర్లు ఉన్నాయి.  శామ్‌‌సంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌ స్క్రీన్‌ 7.3 ఇంచ్‌. అంటే తెరిచినప్పుడు - మొత్తం స్క్రీన్‌ డయాగనల్‌గా 7.3 అంగుళాలుంటుంది. 12జీబీ ర్యామ్, 512 జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఈ మొబైల్ ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం కేవలం 4,380 ఎంఏహెచ్‌ ఉండటం పెద్ద లోపం అని చెప్పొచ్చు. సెప్టెంబర్ 18, 2019 న ఇండియాలో లాంచ్ కాబోతున్నది.  దీని ధర రూ. 1,40,790/-గా ఉన్నది.