శాంసంగ్ నుండి మరో స్మార్ట్‌ఫోన్‌

శాంసంగ్ నుండి మరో స్మార్ట్‌ఫోన్‌

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ నుండి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. 'గెలాక్సీ ఆన్ 8' నూతన స్మార్ట్‌ఫోన్‌ని భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మేరకు శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సందీప్ సింగ్ అరోరా ప్రకటించారు. ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్ లో ఆగష్టు 6 నుండి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఈ ఫోన్ ధర రూ.16,990గా ఉంది. 4 జీబీ ర్యామ్.. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్(ఎక్స్ స్పాండబుల్ 256జీబీ)ను కలిగి ఉంది. 16/5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు.. 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో 'చాట్ ఓవర్ వీడియో' ఫీచర్ కూడా ఉంది.

ఫీచర్లు:

# 6.0 ఇంచుల డిస్‌ప్లే 
# 720 x 1480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
# స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
# 3500 ఎంఏహెచ్ బ్యాటరీ
# 3.5 ఎంఎం జాక్