ఎన్టీఆర్‌కు బాబాయిగా నటిస్తున్నాడు !

ఎన్టీఆర్‌కు బాబాయిగా నటిస్తున్నాడు !

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సముథిరఖని 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో అయన కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్‌కు బాబాయిగా కనిపిస్తారని తెలుస్తోంది.  బ్రిటిష్ వారిపై తిరుగుబాటును ప్రారంభించే వ్యక్తిగా ఆయన పాత్ర ఉంటుందట.  ఇకపోతే ఇందులో మరొక హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.  చరణ్ జోడీగా అలియా భట్ కుదరగా ఎన్టీఆర్‌కు ఇంకా కథానాయికను ఫైనల్ చేయాల్సి ఉంది.  సుమారు 350 నుండి 400 కోట్ల బడ్జెట్ కేటాయించి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.