గురిపెడితే.. లక్ష్యం ఏదైనా ఇక అంతే..!!!

గురిపెడితే.. లక్ష్యం ఏదైనా ఇక అంతే..!!!

టాలీవుడ్ లో సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు.  అటు కోలీవుడ్ లోను టాప్ హీరోలతో సినిమాలు చేసింది.  మంచి హిట్స్ కొట్టింది అయినా పెద్దగా ఉపయోగం లేదు.  ఏమైందో ఏమో తెలియదుగాని, సడెన్ గా బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.  అక్కడ పింక్ సినిమా చేసింది.  ఈ సినిమా బంపర్ హిట్టైంది.  

పింక్ హిట్ తరువాత వరసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది తాప్సి.  రీసెంట్ గా చేసిన బద్లా కూడా మంచి కొట్టింది.  ప్రస్తుతం తాప్సి సాండ్ కి ఆంఖ్ సినిమా చేస్తోంది.  ప్రకాశి తోమర్, చంద్రు తోమర్ అనే ఇద్దరు తోడికోడళ్లు సినిమా ఇది.  వీరిద్దరికి మంచి టాలెంట్ ఉంది.  ఎందులోనో అనుకునేరు.  గన్ షూటింగ్ లో.  గన్ ఎక్కుపెడితే లక్ష్యం చేరాల్సిందే.  అంత టాలెంట్ ఉన్న మహిళలు వీరిద్దరూ.  

ఈ ఇద్దరి జీవితం ఆధారంగా సాండ్ కి ఆంఖ్ తెరకెక్కుతోంది.  తాప్సి తో పాటు భూమి ఈ సినిమాలో యాక్ట్ చేస్తోంది.  30 ఏళ్ల వయసులో ఉన్న ఈ ఇద్దరు... 60 సంవత్సరాల మహిళలుగా కనిపిస్తున్నారు.  దీపావళికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోవడంతో పాటు వైరల్ గా మారింది.