ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం తీర్పు 

ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం తీర్పు 

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది. రూ.100 కోట్లు డిపాజిట్‌ చేయాలన్న ఎన్జీటీ ఆదేశాలు అడ్డుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని ఏపీ వాదించింది. రెండు వారాల్లో ఎన్జీటీని మళ్లీ ఆశ్రయించాలని ఏపీకి కోర్టు సూచించింది. మూడు నెలల్లోపు కేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీం ఆదేశించింది. 'రాష్ట్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన రిపోర్ట్ ను కాదంటారా ? మీ సొంత అధికారులు ఇచ్చిన నివేదిక పై అభ్యంతరం వ్యక్తం చేయడం ఏంటీ. ఇది చాలా  సీరియస్ విషయం. తమ వాదనలు వినకుండా కేసును సుమోటోగా విచారించారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది గంగూలి వాదన. అయితే, మరోసారి ఎన్జీటీ లో  మీ వాదనలు వినిపించాలని సుప్రీం ఆదేశం. ఏపీ ప్రభుత్వ మైనింగ్ శాఖ అధికారులు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి,  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంయుక్తంగా నివేదిక తయారు చేశారు' అని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు తెలిపారు.