ప్రముఖ నటిపై అత్యాచారం..వీడియోలు అప్లోడ్ చేస్తానని బెదిరింపులు .!

  ప్రముఖ నటిపై అత్యాచారం..వీడియోలు అప్లోడ్ చేస్తానని బెదిరింపులు .!

ప్రముఖ కన్నడ నటిపై ఓ ప్రైవేట్ కంపెనీ సీఈఓ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా వీడియో తీసి ఆమెను వేధింపులకు గురి చేసాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బెంగుళూరులోని జేజే నగరంలోని ఓ అపార్టుమెంట్‌లో కన్నడ నటి నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు నాయండహళ్లికి చెందిన మోహిత్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు ఒక ప్రైవేట్ కంపెనీకి సీఈఓ అని చెప్పుకున్నాడు. అంతే కాకుండా ఆ నటితో కంపెనీ ప్రమోషన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఆమెను గోవా తీసుకెళ్లి ఫోటో షూట్ కూడా చేయించాడు. కాగా ఇటీవల అతడి పుట్టినరోజుకు ఆమెను ఇంటికి రావాలని కోరాడు. పార్టీ అనంతరం ఇద్దరూ కలిసి  భోజనం చేశారు. తర్వాత నటికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక అత్యాచారం చేసి వీడియో ను చిత్రించాడు. అప్పటినుండి ఆమెను డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నిందితుడికి భయపడ్డ నటి ఇప్పటికే 11లక్షల రూపాయలు సమర్పించుకుంది. తాజాగా మళ్ళీ రూ. 9 లక్షలను ఇవాలని లేదంటే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దాంతో నటి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.