చందాకొచ్చర్‌కు ఉద్వాసన? కొత్త సీఈవో ఈయనే!

చందాకొచ్చర్‌కు ఉద్వాసన? కొత్త సీఈవో ఈయనే!

రుణాల మంజూరి, క్విడ్‌ప్రోకో వివాదంలో చిక్కుకున్న ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందాకొచ్చర్‌కు ఉద్వాసన తప్పేలా లేదు. వీడియోకాన్ రుణాల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచ్చర్‌ను తప్పేంచే ఆలోచనలో ఉంది ఐసీఐసీఐ బ్యాంక్. ఈ రోజు జరిగే బ్యాంక్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీడియోకాన్‌కు లోన్ ఇచ్చే విషయంలో చందా కొచ్చర్‌... నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించడంతో చందా కొచ్చర్ లాంగ్ లీవ్‌లోకి వెళ్లిపోయారు. దర్యాప్తు పూర్తి అయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని కొచ్చర్‌కు ఐసీఐసీఐ బోర్డు ఆదేశించింది. మరోవైపు బ్యాంక్ టాప్ మేనేజ్‌మెంట్‌లో భారీ మార్పులు చేయాలని ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. ఐసీఐసీఐ ఇన్సూరెన్స్ విభాగానికి సీఈవోగా వ్యవరహరిస్తున్న సందీప్ బక్షికి తాత్కాలికంగా బ్యాంకు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉంది మేనేజ్‌మెంట్.