ప్రభాస్ తో సందీప్ రెడ్డి సినిమా...? 

ప్రభాస్ తో సందీప్ రెడ్డి సినిమా...? 

బాహుబలి తరువాత ప్రభాస్ జాతీయ స్థాయిలో హీరో అయ్యారు.  ఈ సినిమా కోసం బాహుబలి హిట్ తరువాత ప్రభాస్ సాహో సినిమా చేశారు.  ఈ సినిమా తెలుగులో పెద్దగా హిట్ కాలేకపోయినా... బాలీవుడ్ లో మాత్రం సినిమా భారీ వసూళ్లు సాధించింది.  ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయ్యింది.  

దీనిని కూడా ప్రభాస్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  అయితే, ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ మరో సినిమా కూడా ప్లాన్ చేశారు.  తెలుగులో అర్జున్ రెడ్డి, బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాతో హిట్ కొట్టిన సందీప్ రెడ్డి, ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.  ఇప్పటికే కథ ఒకే చేసినట్టు తెలుస్తోంది.  జాన్ సినిమా తరువాత ఈ మూవీ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.