ముందస్తుకు ముందే స్క్రిప్ట్...

ముందస్తుకు ముందే స్క్రిప్ట్...

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ముందే స్క్రిప్ట్ రచించారని విమర్శించారు టీడీపీ తాజా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య... ఢిల్లీ డైరెక్షన్‌లో... గవర్నర్ సాయంతో కేసీఆర్... అసెంబ్లీని రద్దు చేశారని ఆరోపించిన ఆయన... ముందస్తుకు సరైన కారణం చెప్పలేదని మండిపడ్డారు. విమర్శించే హక్కు ప్రతిపక్షాల సొంతం... దీనికే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా..? అంటూ ఎద్దేవా చేసిన సండ్ర... విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటి గురించి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ప్రస్తావించకుండా ఎన్నికల కోసం కుమ్మకయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలతో కలిపే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే ఉంటే... రూ. 400 కోట్ల ప్రజా ధనం వృథా అయ్యేది కాదన్నారు సండ్ర వెంకట వీరయ్య.