ఆయన్ను కొనసాగించాలని అధిష్టానానికి లేఖ రాస్తా..

ఆయన్ను కొనసాగించాలని అధిష్టానానికి లేఖ రాస్తా..

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా.. టీపీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించాలని అధిష్టానానికి లేఖ రాస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. స్వతహాగా ఉత్తమ్ తప్పుకుంటే మొదటి అవకాశం శ్రీధర్ బాబుకు, రెండో అవకాశం రేవంత్ రెడ్డికి ఇవ్వాలని సూచించారు. అధిష్టానం టీఆర్ఎస్ తో పొత్తును ఆహ్వానిస్తే.. మేం శిరసావహిస్తామని తెలిపారు. మాకు కావాల్సింది రాహుల్ రాజ్యం. రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నా.. లేకున్నా మాకు సంబంధం లేదని పేర్కొన్నారు. రాహుల్ ప్రధాని అయితే అంతకు మించి ఏమి కావాలని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా కాంగ్రెస్ స్థానిన ఎన్నికల్లో బలమైన పాత్ర పోషించించిందని తెలిపారు. అనేక జిల్లాల్లో కూడా... చైర్మన్ పదవి దక్కించుకుంటుంది' అని జగ్గారెడ్డి అన్నారు.