నీళ్ల కోసం జగ్గారెడ్డి మరో ఉద్యమం

నీళ్ల కోసం జగ్గారెడ్డి మరో ఉద్యమం

సింగూరు..మంజీరా నీటి విషయంలో సీఎం కేసిఆర్ జోక్యం చేసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేసారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలకు మంజీరా నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సింగూరు నీళ్లను విడుదల చేయడమే తప్పని,  నింపుతామని చెప్పిన హరీష్ రావు ఎందుకు ఆలక్ష్యం చేసారని జగ్గారెడ్డి నిలదీసారు. మంజీరా నీళ్లు కేవలం సంగారెడ్డి దాహార్తి తీర్చేందుకేనని, నీటి విషయంలో హరీష్ చేసిన అన్యాయం పై ఇంటి ఇంటికి కరపత్రాలు పంచుతున్నామని చెప్పుకొచ్చారు.  

సంగారెడ్డి ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని, సింగూరు, మంజీరాలను వెంటనే నింపాలని డిమాండ్ చేసారు. ఈనెల 18 నుంచి తన భార్యతో కలిసి రిలే నిరాహారదీక్ష చేస్తామని జగ్గారెడ్డి ప్రకటించారు. నీళ్లు నింపే వరకు దీక్షలు కొనసాగుతాయని హెచ్చరించారు. దీక్ష అనుమతి కోసం దరఖాస్తు పెట్టామని చెప్పిన జగ్గారెడ్డి, అనుమతిస్తే శాంతియుతంగా చేస్తామని లేదంటే శాంతిభద్రతల సమస్యకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నీటి విషయంలో సిఎం కేసిఆర్ ను కలవడానికి సైతం సిద్ధమని సంగారెడ్డి ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.