సంగారెడ్డికి తాగునీటి కష్టాలు తీర్చాలి: జగ్గారెడ్డి

సంగారెడ్డికి తాగునీటి కష్టాలు తీర్చాలి: జగ్గారెడ్డి

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. హరీష్ కారణంగానే మంజీరా, సింగూర్‌ జలశయాలు అడుగంటాయని ఆరోపించారు. హరీశ్‌రావు తప్పు చేశారు కాబట్టే తన వ్యాఖ్యలపై స్పందించడం లేదన్నారు. తాను చెబుతున్నవి వాస్తవాలు అందుకే టీఆర్ఎస్ మౌనంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రెండింటి నుంచి 15టీఎంసీల నీటిని అనధికారికంగా బయటకు తరలించారని ఆరోపించారు. చేసిన తప్పును వెంటనే ప్రభుత్వం సరిదిద్దాలన్నారు. గ్రౌండ్‌వాటర్‌ తగ్గిపోయి ఒక్క బోరు కూడా పడటం లేదని, ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంపి దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించి సంగారెడ్డికి తాగునీటి కష్టాలు రాకుండా చూడాలని కోరారు. తాను కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలవబోనని... మీడియా ద్వారానే సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.