రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాసారు. కొత్తవారికే ఎన్నికల్లో సీట్లు ఇవ్వండని కోరిన జగ్గారెడ్డి, రెండు సార్లు ఓడిపోయిన వారికి టికెట్లు ఇవ్వద్దని పేర్కొన్నారు. వారికి పార్టీ పదవులు ఇవ్వండని సూచించారు. పార్టీ బలోపేతానికి యువశక్తి అవసరమని,  యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, ఉస్మానియా నుండి వచ్చిన నాయకుల్లో ఆసక్తి ఉన్నవారికి టికెట్ ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేసారు.ఇవే అంశాలు పీసీసీ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేసారు.