తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన సానియా

తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన సానియా

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియామీర్జా చాలా కాలం తర్వాత రాకెట్‌ పట్టుకున్న సంగతి తెలిసిందే . బిడ్డకు జన్మ నివ్వడంతో  దాదాపు రెండేళ్లు సానియా టెన్నిస్ కు దూరమైంది. తాజాగా జరిగిన ఖతార్ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే నిరాశపరిచింది సానియా. మొదటి రౌండ్ లోనే ఇంటిదారి పట్టింది . మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌లో ఫ్రెంచ్‌ క్రీడాకారిణి  గార్సియాతో కలిసి బరిలోకి దిగిన సానియా .. లారా -కాగ్లా జంట చేతిలో ఓటమిపాలైంది. 4-6, 5-7 తేడాతో వరుస సెట్లలో ఓడిపోవడంతో టోర్నీ నుంచి వైదొలిగారు .  కాగా ఇటీవల హోబర్ట్‌ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో సానియా  విన్నర్ అయిన  సంగతి తెలిసిందే. మహిళా డబుల్స్‌లో ఉక్రెయిన్‌ భామ నదియాతో కలిసి సానియా ఆ టైటిల్‌ సాధించింది. కాగా మంగళవారం జరిగిన టోర్నీలో సానియా ఓటమిపాలవడంతో ఆమె అభిమానులు నిరాశపడ్డారు.