బ్రేకింగ్ : సంజయ్ దత్ కి స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్

బ్రేకింగ్ : సంజయ్ దత్ కి స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీలో నొప్పితో చేరిన ఆయన మూడు రోజులు ఆసుపత్రిలో ఉండి రిలీజ్ అయ్యారు. ఆస్పత్రిలో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది.  సంజయ్ దత్.. సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఏ ఆందోళన అక్కర్లేదని  చెప్పారు.  అయితే అలా నిన్న ప్రకటించారో లేదో ఇప్పుడు ఆయనకు క్యాన్సర్ అని తేలింది. అది కూడా ప్రమాద కరమైన లంగ్ క్యాన్సర్. సంజయ్ దత్ కి స్టేజ్-3 ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న విషయం నిన్న చేసిన టెస్ట్ లలో బయటపడింది. సంజయ్ దత్ కి బాగా తాగుడు మరియు సిగరెట్ల అలవాటు ఉందన్న విషయం తెలిసిందే. గతంలో అతను మాదకద్రవ్యాలు కూడా తీసుకున్నట్లు అతని బయోపిక్ గా పేర్కొన్న ‘సంజు’ లో కూడా చూపించారు. అవే ఆయన క్యాన్సర్ కి కారణం అయి ఉండచ్చని చెబుతున్నారు.