బాలయ్య సినిమాలో సంజయ్ దత్ విలనా? 

బాలయ్య సినిమాలో సంజయ్ దత్ విలనా? 

బాలకృష్ణ 105 వ సినిమా రూలర్ షూటింగ్ చివరిదశకు చేరుకున్నది.  వచ్చే నెల 20 వ తేదీన సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నది.  కెఎస్ రవికుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  రూలర్ సినిమాలో బాలయ్య కొత్తగా కనిపిస్తున్నారు.  ఈ సినిమా పూర్తైన తరువాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు.  ఈ సినిమా కథ ఇప్పటికే పూర్తయింది.  స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు సమాచారం.  

బాలయ్య, బోయపాటి సినిమాలో బాలీవుడ్ నటుడు, హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారని సమాచారం.  సంజయ్ దత్ కూడా ఇందులో విలన్ గా నటించేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది.  లెజెండ్ సినిమాతో జగపతిబాబును విలన్ గా పరిచయం చేశాడు బోయపాటి.  ఈ సినిమా తరువాత జగపతిబాబు విలన్ గా పాపులర్ అయ్యాడు.  కాల్ షీట్ ఖాళీ లేనంతగా బిజీ అయ్యాడు జగపతిబాబు.  ఇప్పుడు బాలయ్య సినిమాలో సంజయ్ దత్ ను విలన్ గా తీసుకుంటున్నారు కాబట్టి ఈ సినిమాతో సంజయ్ దత్ కూడా బిజీ అవుతారని అనుకోవచ్చు.