జడేజా సూపర్‌ ఇన్నింగ్స్‌పై మంజ్రేకర్‌ కామెంట్‌

జడేజా సూపర్‌ ఇన్నింగ్స్‌పై మంజ్రేకర్‌ కామెంట్‌

'అరకొర ఆటగాడు' అంటూ టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై మొన్నామధ్య నోరు పారేసుకున్న మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మరోసారి స్పందించాడు. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో 59 బంతుల్లో 77 పరుగులు చేసి అదరగొట్టిన జడేజాను ప్రశంసలతో ముంచెత్తాడు. 

'జడేజా సూపర్‌ బ్యాటింగ్‌తో నా వ్యాఖ్యలు తప్పని నిరూపించాడు. కీలక సమయంలో బాగా బ్యాటింగ్‌ చేశాడు. గతంలో జడేజా ఇలా బ్యాటింగ్‌ చేయడం నేను చూడలేదు' అని వ్యాఖ్యానించాడు మంజ్రేకర్‌. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ జడేజా రాణించి శభాష్‌ అనిపించుకున్నాడని మంజ్రేకర్‌ అన్నాడు. 

'అరకొరగా ఆడే జడేజా' అంటూ మంజ్రేకర్‌ వ్యాఖ్యానించగా.. 'నీకంటే రెండింతలు ఎక్కువ క్రికెట్‌ ఆడాను, ఇంకా ఆడుతున్నాను. ఇతరులను గౌరవించడం నేర్చుకో' అంటూ జడేజా జవాబివ్వడంతో వీరిద్దరి మధ్య 'వార్‌' మొదలైంది.