స్మిత్ చేసింది త‌ప్ప‌యితే.. రోహిత్ చేసింది కూడా త‌ప్పే

స్మిత్ చేసింది త‌ప్ప‌యితే.. రోహిత్ చేసింది కూడా త‌ప్పే

ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్ మూడో టెస్ట్‌లో రిష‌బ్ పంత్ బ్యాటింగ్ గార్డ్‌ను చెరిపేసే ప్ర‌య‌త్నం చేసి స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ప‌నిని కూడా కంగారూలు స‌మ‌ర్థించుకున్నారు. అయితే ఇప్పుడు బ్రిస్బేన్ టెస్ట్‌లో టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ కూడా అలాగే చేశాడు. స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌డు చూస్తుండ‌గానే.. రోహిత్ షాడో బ్యాటింగ్ చేస్తూ స్మిత్‌ చేసిన పనిని సరదాగా చేసి చూపించాడు. అయితే స్మిత్ లాగా బ్యాటింగ్ గార్డ్‌ను రోహిత్ చెరిపేయ‌లేదు. కానీ వివాదాస్పద వ్యాఖ్యాత సంజ‌య్ మంజ్రేక‌ర్ మాత్రం.. అప్పుడు స్మిత్ చేసింది త‌ప్ప‌యితే.. రోహిత్ చేసింది కూడా త‌ప్పే అని చెప్పాడు. రోహిత్ కావాల‌నే స్మిత్ ముందు ఇలా చేశాడ‌ని అత‌ని బాడీ లాంగ్వేజ్ ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది అని పేర్కొన్నాడు.