జడేజా పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన మంజ్రేకర్...

జడేజా పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసిన మంజ్రేకర్...

భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఇటీవలి కాలంలో తన కామెంటరీకి కన్నా.. వివాదాలతోనే మంజ్రేకర్‌ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.  2019 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను 'బిట్స్‌ అండ్‌ పీసెస్‌ క్రికెటర్'‌ అని విమర్శించి అభిమానుల ఆగ్రహానికి గురైన కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌... మరోసారి జడేజానే టార్గెట్‌ చేస్తూ మాట్లాడాడు. ఒక క్రమశిక్షణ అంటూ తెలియని జడేజా లాంటి క్రికెటర్లతోనే తనకు ప్రాబ్లమ్‌ అని పేర్కొన్నాడు. నేను గత కొన్నేళ్లుగా నేర్చుకున్న కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడే క్రికెటర్లను ఎంపిక చేస్తా. ఎవరైతే క్రమశిక్షణలో స్పెషలిస్టులుగా ఉంటారో వారితోనే జట్టును భర్తీ చేయాలి. రవీంద్ర జడేజాతో నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ వైట్‌బాల్‌ క్రికెట్‌లో మాత్రం ఆ తరహా క్రికెటర్లతోనే సమస్య. నా జట్టులో చివరికి హార్దిక్‌ పాండ్యా లాంటి ఆల్‌రౌండర్‌ను కూడా ఎంపిక చేయను. ఆ తరహా క్రికెటర్లు భ్రమను కల్పించే వారు మాత్రమే అని పేర్కొన్నాడు.