శివసేన సంచలన ఆరోపణలు..! అది బీజేపీ కుట్రే..?

శివసేన సంచలన ఆరోపణలు..! అది బీజేపీ కుట్రే..?

మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్‌హాట్‌గా మారాయి.. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమంటూ చేతులెత్తేసింది భారతీయ జనతా పార్టీ అయితే.. శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతోన్న శివసేన పార్టీ.. తమకు కొంత్త సమయం కావాలని కోరుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి పదవికి ఆ పార్టీ ఎంపీ రాజీనామా చేయడంతో.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ పొత్తుకు కాస్త ముందుడుగు పడినట్టు అయ్యింది. మరోవైపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్రపన్నుతోందంటూ శివసేన సంచలన ఆరోపణలు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై సోమవారం సాయంత్రం 7:30 గంటల్లోగా అభిప్రాయం తెలపాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ గడువు విధించడం వెనుక కూడా కమలం పార్టీ కుట్ర దాగి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రావత్ సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్‌ ఆహ్వానంపై స్పందించడానికి శివసేనకు సమయం సరిపోకపోతే.. అదే అదునుగా రాష్ట్రపతి పాలన విధించొచ్చని బీజేపీ చూస్తోందని రావత్ మండిపడ్డారు. 

అయితే, గవర్నర్ మాకు మరింత సమయం ఇస్తే ప్రభుత్వ ఏర్పాటు సులభంగా ఉంటుందన్నారు సంజయ్ రావత్... బీజేపీకి 72 గంటల సమయం ఇచ్చిన ఆయన.. మాత్రం అతి స్వల్ప సమయం ఇచ్చారని.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ రచించిన వ్యూహం ఇదేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటామని ఇచ్చిన హామీని నెరవేర్చడానికి బీజేపీ సుముఖంగా లేకుంటే, కూటమిని కొనసాగించడంలో అర్థం లేదని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. "50:50" సూత్రాన్ని పాటించకుండా బీజేపీ ప్రజల ఆదేశాన్ని అవమానించారని పేర్కొన్నారు. అప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) తో బీజేపీ ఒప్పందం కుదుర్చుకుంది.. మహారాష్ట్రలోని ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో సేన ఎందుకు అలా కలిసి సర్కార్ ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. పీడీపీతో బీజేపీ అనుబంధాన్ని" లవ్ జిహాద్ "అని పిలవాలా? అంటూ సెటైర్లు వేశారు.