సంజు, 2పాయింట్ 0 లకు అరుదైన గౌరవం

సంజు, 2పాయింట్ 0 లకు అరుదైన గౌరవం

2018 లో రెండు బాలీవుడ్ నుంచి సంజు, సౌత్ నుంచి రజినీకాంత్ 2పాయింట్ 0 సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా సంజు సినిమా తెరకెక్కితే.. రోబోకు కొనసాగింపుగా శంకర్ 2పాయింట్ 0 ను తెరకెక్కించాడు.  ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.  

ఇదిలా ఉంటె, ఈ రెండు సినిమాలకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కబోతోంది.  ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు ఏషియన్ సినిమా అవార్డ్స్ కు నామినేట్ చేయబడ్డాయి.  బెస్ట్ సినిమా, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్, ఒరిజినల్ మ్యూజిక్, బెస్ట్ స్క్రీన్ ప్లే  వంటి ఆరు విభాగాల్లో పోటీ పడుతుంటే, బెస్ట్ విఎఫ్ఎక్స్, బెస్ట్ సౌండ్ విభాగాల్లో 2పాయింట్ 0 పడుతోంది.  మార్చి 17 వ తేదీన హాంకాంగ్ లో ఈ వేడుక జరగబోతున్నది.