రజినీతో మొదలుకాబోతున్న సంక్రాంతి... 

రజినీతో మొదలుకాబోతున్న సంక్రాంతి... 

రజినీకాంత్ కొత్త సినిమా దర్బార్ వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు కాబట్టి సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు.  నయనతార హీరోయిన్.  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రజినీకాంత్ కనిపిస్తున్నారు.  రజినీకాంత్ సినిమా అంటే సౌత్ లో పండుగే అని చెప్పాలి.  

సౌత్ లో సంక్రాంతి రజినీకాంత్ దర్బార్ తో ప్రారంభం కాబోతున్నది.  ఈ సినిమా రిలీజ్ తరువాత జనవరి 11 వ తేదీన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ మూవీ రిలీజ్ అవుతుంది .  ఈ సినిమా తరువాత జనవరి 12 వ తేదీన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా తరువాత పండుగ రోజున నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా రిలీజ్ చేయబోతున్నారు.  ఈ నాలుగు సినిమాలు సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి.