సంక్రాంతి కోసం స్టార్ హీరోల సైట్ !

సంక్రాంతి కోసం స్టార్ హీరోల సైట్ !

హిట్ అంటూ కొడితే సంక్రాతి సీజన్లో కొట్టాలనేది చాలామంది హీరోల కోరిక.  ఎందుకంటే ఆ సీజన్లో అయితే థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.  అందుకే రాబోయే 2020 సంక్రాంతికి సినిమాల్ని రెడీ చేసుకుంటున్నారు మన స్టార్ హీరోలు.  కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో చేయనున్న సినిమాను సంక్రాతి బరిలోకి దింపాలని డిసైడయ్యారు.  

ఇక మహేష్ బాబు సైతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్న సినిమాను సంక్రాంతి పండుగకు ప్రేక్షకులకు అందివ్వాలని చూస్తున్నారు.  వీరిద్దరితో పాటు అల్లు అర్జున్ సైతం త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాను సంక్రాంతి పోటీలోకి దింపాలని డిసైడ్ అయ్యారట.  వీరందరికంటే ముందే రజనీకాంత్ 'దర్బార్' సినిమాతో సంక్రాంతి పండుగను టార్గెట్ చేశారు.  మరి వీరందరిలో సంక్రాంతి విజేతలు ఎవరో చూడాలి.