28 ఏళ్ల తరువాత.. సూపర్ స్టార్ తో..!!!

28 ఏళ్ల తరువాత.. సూపర్ స్టార్ తో..!!!

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ పెట్ట తరువాత.. మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.  ఎన్నికలకు ముందు అంటే మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2పాయింట్ 0 సినిమాను తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతున్నది.  

ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  28 సంవత్సరాల క్రితం అంటే, 1991లో రజినీకాంత్.. మమ్మూట్టి హీరోలుగా దళపతి సినిమా వచ్చింది.  ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.  ఈ సినిమాకు సంతోష్ శివన్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది.  దళపతి తరువాత సంతోష్ శివన్ తో రజినీకాంత్ సినిమా చేయలేదు.   28 సంవత్సరాల తరువాత ఇప్పుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న రజినీకాంత్ సినిమాకు సంతోష్ శివన్ ఫొటోగ్రఫీ అందించబోతున్నారు.  ఈ విషయాన్ని సంతోష్ శివన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేయడం విశేషం.