అశ్విన్, జడేజా తప్పకుండా 100 టెస్టులు ఆడుతారు...

అశ్విన్, జడేజా తప్పకుండా 100 టెస్టులు ఆడుతారు...

\రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాడు భారతదేశ పరిమిత ఓవర్ల జట్టు నుండి ఎలా బయటపడ్డాడో అర్థం కాకడం లేదు అని పాకిస్తాన్ స్పిన్ గ్రేట్ సక్లైన్ ముష్తాక్ తెలిపాడు.  విజయవంతమైన టెస్ట్ బౌలర్ తక్కువ ఫార్మాట్లలో విజయం సాధించగలడని చెప్పాడు. ఐపీఎల్ ‌లో రెగ్యులర్‌గా ఉన్న అశ్విన్‌ను జూలై 2017 నుండి పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరంగా ఉంచారు. రవీంద్ర జడేజా విషయంలో కూడా అదే జరిగింది, కాని అతను తిరిగి మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు, ఎందుకంటే అతని ఆల్ రౌండ్ సామర్ధ్యాల కారణంగా. "మీరు ఫింగర్ స్పిన్నర్ అయినా, మణికట్టు స్పిన్నర్ అయినా మీ నైపుణ్యాలు, గేమ్ రీడింగ్ ఎబిలిటీస్ చాలా ముఖ్యమైనవి. అయితే అశ్విన్ వన్డే క్రికెట్ నుండి పక్కకు తప్పుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను" అని 'దూస్రా' ఆవిష్కర్త సక్లైన్ చెప్పారు.

అయితే "ఐదు రోజుల ఆటలో బ్యాట్స్మాన్ ను ఎలా అవుట్ చేయాలో అతనికి తెలుసు, ఇది పరిమిత ఓవర్ల క్రికెట్ కంటే చాలా కఠినమైనది. కాబట్టి  మీరు మీ ఉత్తమ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలి" అని బీసీసీఐ కి తెలిపాడు. ఇక భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాదిరిగా అశ్విన్ మరియు జడేజా కూడా ఒక్కొక్కరు 100 టెస్టులు ఆడతారని నాకు చాలా నమ్మకం ఉంది" అని సక్లైన్ అన్నారు. అయితే బీసీసీఐ మరింత వైవిధ్యతను కోరుతూ, సెలెక్టర్లు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మణికట్టు-స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మరియు యుజ్వేంద్ర చాహల్‌లను ఎంచుకున్నారు. వారిద్దరూ  అందులో స్థిరపడ్డారు, కాని 2019 ప్రపంచ కప్ తరువాత భారత తుది జట్టులో వారు కనిపించలేదు.