సెహ్వాగ్ 300 కంటే సచిన్ 100 బెస్ట్... 

సెహ్వాగ్ 300 కంటే సచిన్ 100 బెస్ట్... 

భారత టెస్ట్ జట్టులో సచిన్  టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు. అయితే సెహ్వాగ్ భారత జట్టు తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు. కానీ సెహ్వాగ్ 300 కంటే సచిన్ 100 బెస్ట్ అంటున్నాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముష్తాక్.  సెహ్వాగ్ తన మొదటి  ట్రిపుల్ సెంచరీ పాకిస్థాన్ పై 2004 ముల్తాన్‌లో చేసాడు. అయితే దీన్ని కంటే సచిన్ తమ పై  1999 చెన్నై లో చేసిన 136 పరుగులు అత్యుత్తమ అంటున్నాడు ముష్తాక్. 1999 చెన్నై టెస్ట్ మరియు 2004 ముల్తాన్ టెస్ట్ రెండింటిలోనూ పాకిస్తాన్ జట్టులో సక్లైన్ ముష్తాక్ ఉన్నాడు. 1999 లో మేము భారత పర్యటనకు అని రకాలుగా సిద్ధమై వెళ్ళాము. అప్పుడు జరిగిన మ్యాచ్ ఓ యుద్ధంల జరిగింది అని చెప్పాడు. మేము భారతదేశానికి వ్యతిరేకంగా ఆడిన 2004 సిరీస్ లోవారు మా దేశానికి వచ్చారు, అప్పుడు  మాకు లేదు ప్లానింగ్, సన్నాహాలు లేవు. అందువల్ల సెహ్వాగ్ చాలా విధ్వంసక దాడి చేసే ఆటగాడు కానీ నేను ఆ ట్రిపుల్ సెంచరీని బెస్ట్ అనుకోను కానీ అతను చాలా మంచి నాక్స్ ఆడాడు అని తెలిపాడు.