పాలిటిక్స్ లోకి వచ్చేస్తా అంటోన్న యంగ్ హీరోయిన్

పాలిటిక్స్ లోకి వచ్చేస్తా అంటోన్న యంగ్ హీరోయిన్

ప్రస్తుతం ఎన్నికల స్టంట్ నడుస్తోంది.  ఎన్నికల గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా... వాటిని నెటిజన్లు విపరీతంగా చూస్తున్నారు. సెలెబ్రిటీలు ఎన్నికల గురించి మాట్లాడితే... అలాంటి న్యూస్ హాట్ హాట్ గా సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంటాయి.  ఇలాంటి హాట్ న్యూస్ లు హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్న సమయంలో మరో బాలీవుడ్ హాట్ హీరోయిన్ పాలిటిక్స్ గురించి ఓ హాట్ న్యూస్ చెప్పింది.  

తనకు రాజకీయాలంటే చాలా ఆసక్తి వుందని తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని చెప్పింది.  ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా అలీఖాన్.  ఫస్ట్ సినిమాతో బాలీవుడ్ లో ఆకట్టుకున్న ఈ సెలెబ్రిటీ హీరోయిన్, రణ్వీర్ సింగ్ తో చేసిన సింబా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్ హోదాను సొంతం చేసుకుంది.  మొన్ననే కదా సినిమాల్లోకి వచ్చింది అప్పుడే రాజకీయాలు ఏంటని అనుకోకండి... ఇప్పుడే రాదట... సినిమా అవకాశాలు తగ్గిపోయాక రాజకీయాల్లోకి వస్తానని అంటోంది సారా.