అర్జున్‌ ను అభినందించిన సోదరి సారా టెండూల్కర్‌...

అర్జున్‌ ను అభినందించిన సోదరి సారా టెండూల్కర్‌...

ఐపీఎల్ 2021‌ సీజన్‌ కోసం తాజాగా జరిగిన వేలంలో... మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌ను బేస్‌ ప్రైస్‌ 20లక్షలకు ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది. అయితే అర్జున్‌ ముంబై ఇండియన్స్‌ తరపున ఆడబోతున్నందుకు... అతని సోదరి సారా తెందూల్కర్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అర్జున్‌ బౌలింగ్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది. ''నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవరూ తీసుకోలేరు. ఇది నీది. క్రికెట్‌ నీ రక్తంలోనే ఉంది. ఇన్నాళ్లూ నెట్స్‌లో సాధన చేసి మేటి క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్‌ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు..'' అంటూ పోస్టు పెట్టింది. చూడాలి మరి ఐపీఎల్ 2021 లో అర్జున్ ఎలా రాణిస్తాడు అనేది.