రూట్‌ మార్చిన పవన్‌ హీరోయిన్‌..!

రూట్‌ మార్చిన పవన్‌ హీరోయిన్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా  సినిమా హీరోయిన్ గుర్తుందా..? అమ్మడి పేరు సారా జేన్ డయాస్ ఈ అమ్మడికి ఎందుకనో తెలుగులో సైరైన గుర్తింపు దక్కలేదు.. ఆతర్వాత బాలీవుడ్ చెక్కేసింది సారా. ఇక హిందీలో ఓ అరడజను సినిమాల్లో నటించింది. సారా మొదటినుంచి మోడలింగ్ లో ఆరితేరింది కాబట్టి అందాల ఆరబోతకు అమ్మడికి హద్దే ఉండదు. సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలతో కుర్రకారుకి ట్రీట్ ఇస్తూ ఉండటం సారాకు సర్వసాధారణం. అయితే.. సాటి హీరోయిన్లతో పోటీపడాలంటే అందుకు తగ్గట్టే గ్లామర్‌ ఎలివేషన్‌తో రెచ్చిపోవాలి. ఈ విషయంలో తాను తక్కువేమీ కాదని ప్రూవ్‌ చేస్తోంది ఈ భామ. తాజాగా.. ఈ భామ వరుస ఫోటో షూట్లతో విరుచుకుపడుతోంది. హాట్‌ కంటెంట్‌ ని అభిమానుల కోసం ఇన్‌ స్టాలో షేర్‌ చేస్తోంది. ఆ ఫోటోలతో ఈ అమ్మడుకు క్రేజ్‌ పెరిగిపోతోంది. అంతేకాదు.. ఇటీవల తమిళ సినిమా ఆఫర్‌ కూడా వచ్చిందట.