అంబులెన్స్‌లో వచ్చి లొంగిపోయిన రాజగోపాల్

అంబులెన్స్‌లో వచ్చి లొంగిపోయిన రాజగోపాల్

ప్రిన్స్ శాంతకుమార్ హత్య కేసులో శరవణ భవన్ హోటల్స్ యజమాని పి.రాజగోపాల్‌ ఇవాళ చెన్నై కోర్టులో లొంగిపోయారు. ముఖానికి ఆక్సిజన్ మాస్క్‌తో అంబులెన్స్‌లో ఆయణ్ను అనుచరులు కోర్టుకు తీసుకువచ్చారు. తనకు విధించిన జీవిత ఖైదును కొంచెం ఆలస్యంగా ప్రారంభించాల్సిందిగా ఆయన నిన్న కోర్టును విజ్ఞప్తి చేశారు.  ఐతే.. ఇవాళ ఆయన ఏకంగా ఆక్సిజన్‌ మాస్క్‌తో కోర్టులో లొంగిపోవడంతో న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. అంత అనారోగ్యంగా ఉంటే.. అప్పీల్ విచారణకు ఒక రోజు ముందు తన ఆరోగ్యం విషయాన్ని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. 2001లో తన దగ్గర పనిచేసిన ఉద్యోగిని కిడ్నాప్ చేసి, హత్య చేసిన కేసులో దోషిగా తేలడంతో రాజగోపాల్‌కు యావజ్జీవ శిక్ష పడింది.