'ఆవలింత'పై స్పందించిన పాక్‌ కెప్టెన్‌

'ఆవలింత'పై స్పందించిన పాక్‌ కెప్టెన్‌

భారత్‌తో జరిగిన వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో కీపింగ్‌ చేస్తూ ఆవలించి తీవ్ర విమర్శల పాలైన పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఈ విషయంపై ఎట్టకేలకు స్పందించాడు. 'నేను కేవలం ఆవలించాను. ఇది ఎవరికైనా సహజమే. ఇదేం నేరం కాదు.. నేను నేరం చేయలేదు' అని అన్నాడు. తన ఆవలింత ఫొటోను ట్రోల్‌ చేస్తూ, యాడ్స్‌ తీస్తూ డబ్బు సంపాదిస్తున్నారని తెలిసిందని.. తన వల్ల కొందరికి మంచే జరగడం సంతోషమేనని అన్నాడు. సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ను నియంత్రించడం కష్టమన్న సర్ఫరాజ్‌..  ఏది తోస్తే అది రాసిపారేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు.