పాక్‌ కెప్టెన్ సర్ఫరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

పాక్‌ కెప్టెన్ సర్ఫరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు... ఐసీసీ వరల్డ్ కప్‌ మెగా టోర్నీలో పాకిస్థాన్ జట్టు లీగ్ దశకే పరిమితమైంది... సెమీస్‌లో బెర్త్ దక్కించుకున్న న్యూజిలాండ్ జట్టుతో సమానంగా 11 పాయింట్లు సాధించినా రన్‌రేట్ కారణంగా సెమీస్ రేస్‌లో నిలవలేకపోయింది. అయితే, తమ జట్టు ఓటమిపాలైనందుకు తానేమీ సిగ్గు పడడం లేదని, రిటైర్మెంట్ లాంటి ఆలోచనే లేదని పేర్కొన్నాడు ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. ఓవైపు జట్టు వైఫల్యంపై పాక్ ఫ్యాన్స్ ఫైర్ అయితుంటే.. వరల్డ్ కప్‌లో తమ జట్టు ప్రదర్శనపై మీడియాతో మాట్లాడిన సర్ఫరాజ్ "వరల్డ్ కప్‌లో మా ప్రదర్శనకు మేం సిగ్గుపడాల్సిన పనిలేదని అనుకుంటున్నా. మొదటి ఐదు కష్టమైన మ్యాచ్‌లు పడ్డాయి. ముఖ్యంగా ఇండియాతో ఓటమి కూడా. కానీ, జట్టు ఆడిన విధానానికి నేను గర్వపడుతున్నా. ఆ తర్వాత చివరి నాలుగు మ్యాచ్‌లు వరుసగా గెలిచాం. మేం క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా" అంటూ తమ జట్టును వెనుకేసుకొచ్చాడు. ఇక, కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ వస్తున్న డిమాండ్లను సైతం కొట్టిపారేశాడు సర్ఫరాజ్.. జట్టుకు సారథిగా ఎవరు ఉండాలో నిర్ణయించేది పాకిస్థాన్ క్రికెట్ బోర్డేనన్న ఆయన.. ఓ రకంగా చెప్పాలంటే ఆటగాళ్ల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుత క్రికెటర్లు. వరల్డ్ కప్‌ నుంచి పాఠాలు నేర్చుకున్నారని చెప్పుకొచ్చాడు. కాగా, కనీసం సెమీస్‌లో కూడా అడుగుపెట్టలేకపోయారంటూ తమ క్రికెట్ జట్టుపై పాక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.. సోషల్ మీడియాలో మండిపడుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఆవలింతపై కూడా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే.