భారత్‌తో మ్యాచ్‌పై సర్ఫరాజ్‌ కామెంట్స్..

భారత్‌తో మ్యాచ్‌పై సర్ఫరాజ్‌ కామెంట్స్..

వరల్డ్‌కప్‌లో మరో మూడు రోజుల్లో భారత్‌ - పాక్‌ అమీతుమీ తేల్చుకోబోతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చతికిలపడ్డ పాక్‌.. భారత్‌తో మ్యాచ్‌ నాటికి పూర్థి సన్నద్ధంగా ఉండాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆ జట్టు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ స్పష్టం చేశాడు.

'ఇండియాతో మ్యాచ్‌ నాటికి అన్ని విభాగాల్లోనూ మెరుగుపడాలి. ముఖ్యంగా ఫీల్డింగ్‌పై మేం శ్రద్ధ పెట్టాలి. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మా ఫీల్డింగ్‌ ఆశించిన స్థాయిలో లేదు' అని చెప్పాడు. భారత్‌పై గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తామన్నాడు. ఇక.. 1992 తర్వాత ఇప్పటి వరకు ఏ వరల్డ్‌కప్‌లోనూ భారత్‌ఫై గెలవని పాక్‌.. ఈసారి బోణీ కొట్టాలని భావిస్తోంది.