అమీర్ ఖాన్ కూతురికి కమల్ హాసన్ భార్య సాయం..!!

అమీర్ ఖాన్ కూతురికి కమల్ హాసన్ భార్య సాయం..!!

బాలీవుడ్ హీరోల్లో ఒకరుఅమీర్ ఖాన్.  అమీర్ సినిమాలు ఎలా ఉంటాయో తెలిసిందే.  రీసెంట్ గా వచ్చిన హిందోస్తాన్ మినహా మిగతా సినిమాలు సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.  మాములుగా సినిమా ఇండస్ట్రీలో హీరోల వారసులు హీరోలుగా వస్తుంటారు.. హీరోయిన్ వారసులు సినిమాల్లోకి వస్తుంటారు.  బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూతరు ఇరా ఖాన్ సినిమా ఇండస్ట్రీలోకి కాకుండా వేరే రంగంలోకి అడుగుపెట్టాలని అనుకుంది.  

ఇందులో భాగంగా ఇరా ఖాన్ డ్రామా రంగంలోకి అడుగుపెట్టింది.  అందులో నటించాలని కమల్ హాసన్ మాజీ భార్య సారికను అడిగిందట.  కానీ, సారిక అందుకు నిరాకరించింది.  గతంలో సారిక కొన్ని ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అమీర్ ఖాన్ సహాయం చేశారు.  కాగా, ఇప్పుడు ఇరా ఖాన్ నటిస్తున్న డ్రామాకు సారిక నిర్మాతగా వ్యవహరించబోతున్నదట.  ఇరా డ్రామాకు నిర్మాతగా వ్యవహరించి గతంలో అమీర్ ఖాన్ చేసిన చేసిన సహాయానికి ఈ విధంగా సహాయం చేయాలని అనుకుంది.