మహేష్ రెండు సెట్స్ కోసం నాలుగు కోట్లు..!!

మహేష్ రెండు సెట్స్ కోసం నాలుగు కోట్లు..!!

మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ కాష్మీర్ల్ లో ప్రారంభం కాబోతున్నది.  ఇప్పటికే యూనిట్ అంతా కాశ్మీర్ లో ఉన్నది.  త్వరలోనే మహేష్ బాబు కాశ్మీర్ వెళ్ళబోతున్నారు. కాశ్మీర్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు.  ఇక హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్స్ ను వేస్తున్నారు.  

అందులో ఒకటి ట్రైన్ సెట్ కాగా రెండోది విజయశాంతి ఇల్లు.  ట్రైన్ సెట్ లో కామెడీ సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు.  ఈ సన్నివేశాల లెంగ్త్ ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు.  ట్రైన్ సెట్ కోసం దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.  దీంతో పాటు విజయశాంతి ఇంటికోసం మరో 2 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.  వచ్చే ఏడాది సంక్రాంతిని టార్గెట్ చేసి షూట్ చేస్తున్నారు.