కేరళకు "సరిలేరు నీకెవ్వరు" టీమ్.. కీలక సన్నివేశాలు అక్కడే..!

కేరళకు "సరిలేరు నీకెవ్వరు" టీమ్.. కీలక సన్నివేశాలు అక్కడే..!

"మహర్షి" లాంటి సూపర్ హిట్ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు నటిస్తోన్న "సరిలేరు నీకెవ్వరు"పై భారీ అంచనాలే ఉన్నాయి.. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈమూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక, తర్వాత షెడ్యూల్‌ కోసం కేరళకు వెళ్తోంది చిత్ర యూనిట్.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ మూవీకి ఇదే కీలకమైన షెడ్యూల్‌గా తెలుస్తుండగా.. ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు రెడీ అయిపోయింది చిత్ర యూనిట్. 

సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. సూపర్ స్టార్ సరసన.. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్నా స్పెషల్ సాంగ్‌లో చిందేయనుంది.. ఇక, విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న విషయం తెలిసిందే.