మహేష్ కు సాయం చేసిన కేంద్ర మంత్రి... ఎందుకంటే.. 

మహేష్ కు సాయం చేసిన కేంద్ర మంత్రి... ఎందుకంటే.. 

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా జరుగుతున్నది.  ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను జమ్మూ కాశ్మీర్లో చేసిన సంగతి తెలిసిందే.  జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.  చాలా ఇబ్బంది కరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ షూటింగ్ చేయడం అంటే చాలా కష్టం.  దీంతో మహేష్ బాబు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహాయం కోరారు.  

జమ్మూ కాశ్మీర్ లో షూటింగ్ చేసుకోవడానికి అనుమతులు కోరారు.  అనుమతులతో పాటు రక్షణ విషయంలో కూడా అయన సహాయం కోరారు.  మహేష్ బాబు కోరిక మేరకు రక్షణశాఖ మంత్రి మహేష్ బాబుకు సహాయం చేశారట.  ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే షూటింగ్ చేసుకోవానికి అనుమతి ఇచ్చారు.  అంతేకాదు, షూటింగ్ కు వెళ్లే సమయంలో మహేష్ బాబు బుల్లెట్ ప్రూఫ్ కారు వాడుకునే విధంగా కూడా అనుమతులు ఇచ్చినట్టు సమాచారం.  జమ్మూకాశ్మీర్ లో ఆగష్టు 4 వ తేదీతో షూటింగ్ పూర్తి చేసుకొని సరిలేరు నీకెవ్వరూ యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చింది.  ఆగష్టు 5 వ తేదీన అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు ఆంక్షలు కూడా విధించారు.