సరిలేరు జోరు... రూ.112 కోట్లు బీట్ చేసిన మహేష్‌

సరిలేరు జోరు... రూ.112 కోట్లు బీట్ చేసిన మహేష్‌

‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతి ముందు ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు... ఇక వసూళ్లలో దూసుకుపోతున్నాడు. మొన్నటి మొన్న రూ.100 కోట్లు బీట్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్... ఎనిమిది రోజుల్లో రూ.112.3 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ లెక్కల్ని సరిచేస్తున్నాడు. కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తూ రికార్డుల వేటలో పడ్డాడు మహేష్‌. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.7 కోట్ల షేర్ వసూలు చేసి తన కెరియర్ బెస్ట్ ఓపినింగ్స్ రాబట్టిన టాలీవుడ్ సూపర్ స్టార్... సంక్రాంతి సెలవులను ఫుల్ క్యాష్ చేసుకున్నాడు.. ఇక వీకెండ్ కూడా ఈ మూవీకి కలిసివస్తోంది... బాక్సాఫీస్ కా బాప్.. అంటూ తొలి ఎనిమిది రోజుల్లో రూ.112.03 కోట్లు షేర్ రాబట్టి సంక్రాంతి మొగుడు అనిపించుకుంటున్నాడు మహేష్. 

‘సరిలేరు నీకెవ్వరు’ ఎనిమిది రోజుల షేర్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు బీఏ రాజు.. ఇక 8 రోజుల్లో నైజాంలో రూ.29.8 కోట్లు, సీడేడ్‌లో రూ.13.2 కోట్లు, యూఏలో రూ.14.9 కోట్లు, గుంటూరులో రూ.8.51 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.9.04 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.6.02 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.7.34 కోట్లు, నెల్లూరులో రూ.3.32 కోట్లు వసూలు చేయగా... కర్ణాటకలో రూ.7 కోట్లు, తమిళనాడులో రూ.కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.5 కోట్లు, యూఎస్‌ఏలో రూ.7.85 కోట్లు, ఆర్‌ఓడబ్ల్యూ 2.5 కోట్లు.. మొత్తం ఎనిమిది రోజుల షేర్ రూ.112.03 కోట్లుగా పేర్కొన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో అనీల్ సుంకర నిర్మించగా... మహేష్‌ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకపాత్ర పోషించగా.. డీఎస్పీ సంగీతాన్ని అందించాడు.