రివ్యూ :  సర్కార్ 

రివ్యూ :  సర్కార్ 

నటీనటులు : విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, యోగిబాబు తదితరులు 

ఫొటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్ 

సంగీతం : ఏఆర్ రెహమాన్ 

నిర్మాత : కళానిధి మారన్ 

దర్శకత్వం : మురుగదాస్ 

రిలీజ్ డేట్ : 06-11-2018

తుపాకి, కత్తి సినిమాల తరువాత మురుగదాస్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా సర్కార్.  ఓటు ప్రాముఖ్యత గురించి, ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించిన సమాచారంతో విజయ్ మార్క్ మాస్ ఎలివేషన్ తో తెరకెక్కిన సినిమా సర్కార్.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.  

కథ : 

విజయ్ అమెరికాలో పేరుమోసిన ఓ కంపెనీ సీఈవో.  సంవత్సరానికి వెయ్యి కోట్లరూపాయలకు పైగా ఆదాయం.  అలాంటి విజయ్ ఇండియాలో ఎన్నికలు జరగబోతున్న  తరుణంలో తన ఓటు వేయడానికి ఇండియా వస్తాడు.  తీరా ఓటు వేయడానికి బూత్ కి వెళ్తే.. ఓటు ఎవరో వేసేస్తారు.  తన ఓటు తనకు కావాలని కోర్టుకు వెళ్తాడు విజయ్.  రాజ్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని విజయ్ ఓటు తిరిగి ఇవ్వాలని తీర్పు ఇస్తుంది.  ఇలాగే ఓటు గల్లంతైన దాదాపు మూడువేల మంది న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు.  దాంతో ముఖ్యమంత్రి పదవిని కావాలని కోరుకున్న రాధారవి ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్నికలను రద్దుచేసి మరో 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం తీర్పు ఇస్తుంది.  అదే ఎన్నికల్లో విజయ్ సీఎం గా పోటీ చేయాలని అనుకుంటాడు.  ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.  

 

విశ్లేషణ : 

మాములుగా మురుగదాస్ సినిమాలు ఒక సామాజిక కోణాన్ని స్పృశిస్తూ ఉంటాయి.  దానితోపాటు కమర్షియల్ ఫార్మాట్ ను కలిగి ఉంటాయి.  విజయ్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించిన మురుగదాస్, చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా చెప్పేశాడు.  ఓటు దొంగిలించబడితే.. ఎవరైనా సరే రాజ్యాంగబద్దంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఓటును తిరిగి సంపాదించుకునే హక్కు ఉన్నది.  ఈ హక్కుల గురించి మురుగదాస్ ఈ సినిమాలో స్పృశించాడు.  ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలుతున్న ఓ పెద్దమనిషి, ఒక కార్పొరేట్ సీఈవో ల మధ్య జరిగే వార్ ను అత్యంత నాటకీయంగా చూపించడంలో మురుగదాస్ సఫలం అయ్యాడు.  ఓటుకు విజయ్ చేసే ప్రయత్నాలు అన్ని ఆకట్టుకుంటాయి.  విజయ్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.  వారిని దృష్టిలో పెట్టుకొని ఫైట్స్  సీన్స్ ను డిజైన్ చేస్తూ కథను మిస్ కాకుండా జాగ్రత్తపడ్డాడు.  ఫస్ట్ హాఫ్ వరకు సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది.  

సెకండ్ హాఫ్ సినిమా అంతా రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది.  ప్రతినాయకురాలిగా వరలక్ష్మి మెప్పించింది.  విజయ్, వారలక్ష్మిల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు.  పక్కాగా కమర్షియల్ ఫార్మాట్ లో సినిమా చేయాలని ఆలోచించిన మురుగదాస్ లాజిక్ లను మిస్ అయ్యాడు.  రాజకీయ అంశాలను స్పృశిస్తూ.. లాజిక్ లేకుండా చేయడంతో.. ఏం చెప్తున్నాడో అర్ధంకాని పరిస్థితుల్లో పడిపోతాడు. ఓట్లు అమ్ముకోవడం దగ్గరి నుంచి ఉచిత పథకాలను అన్నింటిపైనా సెటైర్లు వేసి ప్రస్తుత రాజకీయాలపై సర్కార్ యుద్ధం ప్రకటించాడు.  మొత్తానికి సినిమా అంతా రాజకీయ కోణంలో తిరుగుతున్నా.. కమర్షియల్ ఫార్మట్ ఎక్కువగా ఉండటంతో ఫ్యాన్స్ మాత్రం బాగా నచ్చుతుంది.  

నటీనటుల పనితీరు : 

విజయ్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. తన అభిమానులను మరోసారి మెస్మరైజ్‌ చేయగలిగాడు. పొలిటికల్‌ డైలాగ్‌లు చెప్పేటప్పుడు విజయ్‌ హావభావాలు ఆకట్టుకుంటాయి. కీర్తి సురేష్‌ది అతిథి పాత్రలా ఉంది. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. సీఎంగా కనిపించిన పాత్రలో తెలుగు నటుడిని ఎంచుకుంటే బాగుండేది. తెరపై ప్రతినాయికగా వరలక్ష్మి బాగా రాణించింది. తన రాకతో విజయ్‌కు ఒక సమఉజ్జీగా నిలబడిన పాత్ర ఒకటి కనిపిస్తుంది. రెహమాన్‌ సంగీతం విషయానికొస్తే పాటలు ఆకట్టుకోవు. ఆ పాటల్లో వాడే పదాలు కూడా కృతకంగా అనిపించాయి. నేపథ్య సంగీతంలో రెహమాన్‌ మార్కు కనిపిస్తుంది. విజువల్‌గా సినిమా బాగుంది. పోరాట సన్నివేశాల్లో కెమెరా పనితనం చక్కగా ఉంది. మురుగదాస్‌ మరోసారి తన శైలికి తగిన కథను ఎంచుకున్నాడు. ప్రస్తుత రాజకీయాలపై ఒక వ్యంగ్యాస్త్రాన్ని సంధించగలిగాడు. అయితే, కమర్షియల్‌ అంశాల జోడింపులో నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు. కొన్నిసార్లు కమర్షియల్‌ విలువల కోసమే తన పంథా మార్చుకోవాల్సి వచ్చింది. 

పాజిటివ్ పాయింట్స్ : 

కథ 

కథాంశం 

విజయ్ 

మైనస్ పాయింట్స్ : 

పాటలు 

లాజిక్ లేకపోవడం 

సెకండ్ హాఫ్ 

చివరిగా : ఫ్యాన్స్ ను మెప్పించిన సర్కార్