సర్కార్ సెన్సార్ పూర్తి

సర్కార్ సెన్సార్ పూర్తి

విజయ్ సర్కార్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ను పొందింది.  నవంబర్ 6 న సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  రిలీజ్ విషయంలో నిన్నటి నుంచి ఓ కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది.  సెంటిమెంట్ కారణంగా.. సినిమాను నవంబర్ 6 నుంచి నవంబర్ 2 కు ప్రీ ఫోన్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి.  ఇవి నిజమో కాదో ఇంతవరకు తెలియలేదు.  

యూఎస్ థియేటర్స్ లిస్ట్ లో నవంబర్ 5 న ప్రీమియర్ అని ఉండటంతో ఈ కన్ఫ్యూషన్ నెలకొన్నది.  నవంబర్ 2 న సినిమా రిలీజ్ చేసేటట్టయితే.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు నిర్వహిస్తారో క్లారిటీ లేదు.  నవంబర్ 6 న రిలీజ్ చేసేటట్టయితే.. సినిమా రిలీజ్ కు 10 రోజుల ముందుగానే సెన్సార్ చేసినట్టు అనే డౌట్స్ వస్తున్నాయి.  నవంబర్ 2 న సినిమా రిలీజ్ ను దృష్టిలో పెట్టుకొనే సెన్సార్ చేయించి ఉంటారని మరో టాక్.  ఈ ఊహాగానాలకు చెక్ పెట్టాలంటే సన్ పిక్చర్స్ సంస్థ దీనిపై అఫీషియల్ గా స్పందిస్తేనే బాగుంటుంది.