మరో రికార్డ్ కోసం సర్కార్ ప్రయత్నం

 మరో రికార్డ్ కోసం సర్కార్ ప్రయత్నం

సర్కార్ సినిమా ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకుంది.  తమిళనాడులో విజయ్ సినిమాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా రికార్డుకెక్కడమే కాకుండా.. కేరళలో కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సినిమాగా మరో రికార్డును సొంతం చేసుకున్నది.  కేరళలోని ఒకటి రెండు థియేటర్స్ లో 24 గంటలపాటు సినిమాను ప్రదర్శించే విధంగా అనుమతి ఇవ్వాలని అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తున్నది.  

ఇటు చెన్నైలోని రోహిణి థియేటర్ లో 48 గంటలపాటు నాన్ స్టాప్ గా సినిమాను ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని విజయ్ ఫ్యాన్స్ ఒత్తిడి తెస్తున్నారు.  పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో ఈ ఒత్తిడి మరింత పెరిగింది.  సున్నితమైన రాజకీయ అంశాలను ఇందులో స్పృశించిన కారణంగా సినిమాకు క్రేజ్ వచ్చింది.  మరి ఫ్యాన్స్ ఒత్తిడికి తమిళనాడు ప్రభుత్వం తలొగ్గుతుందా లేదా చూడాలి.