సర్వభూపాల వాహనంపై విహరిస్తున్న శ్రీవారు

సర్వభూపాల వాహనంపై విహరిస్తున్న శ్రీవారు

తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై ఊరేగుతున్నారు. మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని తిలకించిన భక్తులు ఆథ్యాత్మికఆనందానికి లోనవుతున్నారు. భూపాలురు అంటే రాజులు... భూమిని పాలించేవారు. అష్టదిక్పాలకులకు, భూపాలురకు మాత్రమే కాదు యావత్‌ విశ్వానికి అధిపతి వెంకటేశ్వరుడు. వేలాది రాజులకు అధిపతి అయిన శ్రీనివాసుడు.... ఆయన సేవలో తరించని వారంటూ ఎవరూ ఉండరు. వాహనసేవకు ముందు టీటీడీ కళాకారుల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.