వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ ఏకం కావచ్చు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ ఏకం కావచ్చు

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో పలువురు టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కాంగ్రెస్ నాయకుడు సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యే అవకాశం ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ సారి 100 సీట్లు తప్పకుండా గెలుస్తామని, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం తప్పక అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, ఆయన క్యాబినెట్ లో నేను మంత్రి గా పనిచేయాలని తన కోరికను బయటపెట్టారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాటలను నమ్మి కోటి మంది దళితులు కారు గుర్తుకు ఓటేశారని అన్నారు. అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు.