హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కొత్త బాస్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కొత్త బాస్‌

ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గ‌జం హెచ్‌డీఎఫ్‌సీకి కొత్త బాస్ వ‌చ్చాడు.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా నియ‌మితుల‌య్యారు శశిధర్‌ జగదీషన్. ఇక‌, జగదీషన్ నియ‌మ‌కానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కూడా ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 27 నుంచి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొన‌సాగ‌నున్నారు.. 1996లో బ్యాంకులో చేరిన జగదీషన్‌కు ఫినాన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, తదితర విభాగాలకు అధిపతిగా ప‌నిచేసిన అనుభ‌వం సొంతం.. ఇక‌, ప్రస్తుత ఎండీ ఆదిత్య ప‌ద‌వీకాలం ఈ ఏడాది అక్టోబర్‌ 26తో ముగియ‌నుండ‌గా.. ఆ బాధ్య‌త‌ల‌ను శశిధర్ జ‌గ‌దీష‌న్ స్వీకరించనున్నారు.