కొడుకుని హీరోని చేయడానికి కష్టపడుతున్న దర్శకుడు

కొడుకుని హీరోని చేయడానికి  కష్టపడుతున్న దర్శకుడు

టాలీవుడ్‌లో వారసుల ఎంట్రీ మామూలే. ఎంత మంది ఎంట్రీలు ఇచ్చినా వారసుల్లో కొద్ది మంది మాత్రమె పరిశ్రమలో నిలదొక్కుకుకోగలరు. అది కూడా టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, అదృష్టం కూడా మెండుగా కావాలి. ఇప్పుడు ఒక దర్శకుడి కొడుకు తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.శతమానంభవతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ గా సతీష్ వేగేశ్న దగ్గరయ్యాడు. ఆ తర్వాత అయన చేసిన 'శ్రీనివాస కళ్యాణం', 'ఎంత మంచి వాడవురా' సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆడకపోయినా కుటుంబం అంతా కూర్చుని చూసే సినిమాలు చేస్తారనే పేరు మాత్రం తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు ఆయన తన కుమారుడు సమీర్ వేగేశ్నని హీరోగా పరిచయం చేస్తున్నారని సమాచారం.సమీర్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ ఫుల్ లెంత్ కామెడీ సినిమా వర్కవుట్ చేస్తున్నాడు సతీష్ వేగేశ్న. ఇందులో మరో హీరో కూడా నటించబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.