సీఏఏపై తొలిసారి స్పందించిన సత్య నాదెళ్ల...!

సీఏఏపై తొలిసారి స్పందించిన సత్య నాదెళ్ల...!

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తం చర్చ సాగుతోంది... సీఏఏకు వ్యతిరేకంగా ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగా.. మరోవైపు అనుకూలంగా ర్యాలీలు జరుగుతున్నాయి. దీంతో ఇది వివాదాస్పంగా మారిపోయింది... 13 రాష్ట్రాలు అసలు తాము అమలు చేసేదే లేదని కేంద్రానికి స్పష్టంగా చెప్పేశాయి. అయితే, ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించారు భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల... పౌరసత్వ సవరణ చట్టం బాధ, విషాదం కలిగిస్తోందని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అయితే ఆయన సీఏఏపై కామెంట్ చేశారా? లేదంటే భారతీయ పౌరులు ఎవరు, ఎవరు కాదు అనే అంశంపైనా? అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల ఈ కామెంట్స్ చేయగా.. ఈ మేరకు బెన్ స్మిత్ ట్వీట్ చేశారు. సీఏఏ తర్వాత దేశంలో జరుగుతోన్న పరిణామాలు మాత్రం మంచిది కాదని సత్య నాదెళ్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాధ, విషాదాన్ని కలిగిస్తున్నాయని తనతో చెప్పినట్టు స్మిత్ ట్వీట్ లో పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి భారతదేశం వచ్చి.. తదుపరి ఇన్ఫొసిస్ కంపెనీ సీఈవో కావాలని కోరుకుంటున్నట్లు సత్య నాదెళ్ల చెప్పినట్టు పేర్కొన్నారు స్మిత్. మొత్తానికి సీఏఏపై సత్య నాదెళ్ల తొలిసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు అయ్యింది.