హైదరాబాద్‌‌ చేరుకున్న సత్య నాదెళ్ల

హైదరాబాద్‌‌ చేరుకున్న సత్య నాదెళ్ల

తన తండ్రి యుగంధర్ అంత్యక్రియల నిమిత్తం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ కు చేరుకున్నారు. 82 ఏళ్ల యుగంధర్ శుక్రవారం నాడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు ఆయన అంత్యక్రియలు నేడు హైదరాబాద్‌ లోని మహా ప్రస్థానంలో జరుగనున్నాయి. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నల్లగండ్లలోని సిటిజన్‌ ఆసుపత్రిలో ఆయన భౌతికకాయం ఉండగా, మరికాసేపట్లో భౌతికకాయాన్ని  హైదరాబాద్ కు తరలించనున్నారు.

యుగంధర్‌ స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. 1962 బ్యాచ్‌కి చెందిన యుగంధర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు కేంద్ర ప్రభుత్వంలోనూ పలు కీలక హోదాల్లో పనిచేశారు. పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రధాని కార్యాలయం, గ్రామీణాభివృద్ధి శాఖ విభాగంలో సేవలు అందించారు. యూపీఏ-1 ప్రభుత్వం హయాంలో 2004-2009 వరకు ప్రణాళిక సంఘం సభ్యుడిగానూ సేవలందించారు. 1988 నుంచి 1993 వరకు లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమికి డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అందుకే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.