ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా ...

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా ...

ఏపీ కరోనా వైరస్‌ విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్‌ ఎవరినీ వదలడం లేదు.  ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. తాజాగా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆయనను కలిసిన వారు ఆందోళన చెందుతున్నారు.  ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతం తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా....విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.